రాజమండ్రి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి కేసులో అతను నిందితుడనే విషయం తెలిసిందే. అతను బెయిల్ పై విడుదలయ్యాడు.

తాను ప్రాణాలతో ఉన్నానంటే దానికి జగనన్నే కారణమని శ్రీనివాస్ అన్నాడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి చేసి జైలుకు వెళ్లిన శ్రీనివాస్ 7 నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. 

రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అతను మీడియాతో మాట్లాడాడు. జగన్‌ది జాలి గుండె అని, దాడి సమయంలో తనను కొట్టకుండా అడ్డుకున్నారని శ్రీనివాస్ చెప్పాడు. 

తాను ప్రాణాలతో ఉండడానికి కారణం జగన్ మంచి మనసే కారణమని అన్నాడు. తాను కావాలని జగన్‌పై దాడి చేయలదని, యాక్సిడెంటల్‌గా జరిగిందని అన్నాడు.