శ్రీకాళహస్తి దేవాలయంలో వివాదం రాజుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు ఉద్యోగులపై ఈవో వేటు వేశారు.

శనివారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ ఆలయ సందర్శన సందర్భంగా ఐదుగురు ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహించినట్లు ఆరోపణలు రావడంతో ఈవో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

వీరిలో నలుగురు అటెండర్లు, మరో ఉద్యోగి ఉన్నారు. ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని... తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.