శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

ఉత్తరాంధ్రలో మరో ముఖ్యమైన నియోజకవర్గం శ్రీకాకుళం. ప్రధాన నగరమే కాదు జిల్లా కేంద్రంతో కూడిన ఈ అసెంబ్లీలో పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి ధర్మాన ప్రసాదరావు వున్నారు. ఈసారి కూడా మళ్ళీ ఆయనే శ్రీకాకుళం బరిలో నిలిచారు.   

Srikakulam assembly elections result 2024 RMA

శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాలు :
 
శ్రీకాకుళంలో మొదట్లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్ గా వుండేది.  1983 నుండి 2004 వరకు ఇక్కడ టిడిపి ఓటమన్నదే ఎరగదు. మొదటిసారి తంగి సత్యనారాయణ పసుపు జెండా ఎగరేసారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో అప్పల సత్యనారాయణ గుండ వరుస విజయాలు అందుకున్నారు. అయితే ధర్మాన ప్రసాదరావు ఎంట్రీతో టిడిపి బలమైన పోటీ ఎదుర్కొంటోంది. 

2004, 2009, 2019 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు టిడిపిని ఓడించారు. మధ్యలో 2014 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచింది. మరి ఈసారి శ్రీకాకుళంలో గెలిచేదెవరో చూడాలి.

శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. శ్రీకాకుళం
2.  గారా
 
శ్రీకాకుళం అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -  2,56,243
పురుషులు -    1,27,997
మహిళలు ‌-     1,28,204

శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి శ్రీకాకుళం బరిలో నిలిచారు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ గోండు శంకర్ ను బరిలోకి దింపుతోంది. 

శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుపై టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ 52521 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -  1,74,215 (69 శాతం) 

వైసిపి - ధర్మాన ప్రసాదరావు - 84,084 ఓట్లు (48 శాతం) - 5,777 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - గుండ లక్ష్మీదేవి - 78,307 ఓట్లు (45 శాతం) - ఓటమి

శ్రీకాకుళం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,64,523 ఓట్లు (72 శాతం)

టిడిపి - గుండ లక్ష్మీదేవి - 88,814 (54 శాతం) - 24,131 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - ధర్మాన ప్రసాదరావు - 64,683 (39 శాతం) - ఓటమి

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios