ఏడంతస్థు నుంచి దూకి యువతి ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..?
ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఓ డిగ్రీ యువతి క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. అపార్ట్మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే..?

నేటి యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేకపోతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొలేకపోతున్నారు. అసలూ ముందు వెనుక ఆలోచించకుండా.. ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఓ యువతి క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు , బంధువులకు చెప్పినా తన మాట వినకపోవడంతో మనస్థాపానికి గురైంది. ఇక ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడే బదులు ప్రాణాలు వీడువాలని నిర్ణయించుకుంది. ఆత్మహత్యే శరణ్యం అని భావించింది. అంతే ఏడంతస్థుల భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శుక్రవారం సత్యసాయి జిల్లాలో జరిగింది
వివరాల్లోకెళ్తే.. ఏపీ లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి గోకులంలోని సాయి శ్రీనివాస అపార్ట్మెంట్ లో గౌరీ అనే యువతి కుటుంబంతో నివాసం ఉంటుంది. డిగ్రీ చదువుతున్న గౌరీకి ఇంట్లో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు. తనకు ఇష్టం లేని పెండ్లి చేయాలని కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చేసింది. ఆమె ఎంత చెప్పిన ఒప్పుకోకపోవడం. కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వారు ఆదేశించడంతో.. ఇక పెండ్లి చూపులు జరగడంతో ఎలాగైనా తనకు పెండ్లి చేస్తారని భావించిన ఆ యువతి శుక్రవారం తెల్లవారు జామును ఏడంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రగాయాల పాలైన ఆ యువతిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. యువతి రూంలో సూసైడ్ నోట్ లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆ యువతి అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ద్రుశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.