నటి దివ్యవాణి టీడీపీని వీడటంపై నటి శ్రీరెడ్డి స్పందించారు. దివ్యవాణి ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడో చెప్పానని తెలిపారు. అదే సమయంలో వైసీపీపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నటి దివ్యవాణి.. ఇటీవల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దివ్యవాణి టీడీపీని వీడటంపై నటి శ్రీరెడ్డి స్పందించారు. దివ్యవాణి ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడో చెప్పానని తెలిపారు. గతంలో సాధినేని యామిని, రోజా లాంటి వారు ఇలాంటివి అనుభవించారని అన్నారు. టీడీపీ లేడీస్‌కు అంత ప్రాముఖ్యత ఇవ్వదని విమర్శించారు. ఎన్టీఆర్ గారు పెట్టారు కాబట్టి టీడీపీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. 

మధ్యలో వచ్చిన కొంతమంది వాళ్ల టీడీపీ నాశనం అయిందన్నారు. టీడీపీ మంచి ఆశయాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు టీడీపీకి ఎందుకు దూరంగా ఉంటున్నారనేది అర్థం కావడం లేదన్నారు. బాలకృష్ణ పైకొస్తే టీడీపీలో కొందరు ఓర్వలేరని విమర్శించారు. ఎన్టీఆర్ వారసులు ఆయన పెట్టిన పార్టీలో ఉండలేకపోతున్నారని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వారి ప్రాణాలను చంద్రబాబు చేతిలో ఎందుకు పెడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. 

దివ్యవాణితో తనకు పరిచయం లేదని.. కానీ ఇలాంటి రోజు వస్తుందని చెప్పానని తెలిపారు. దివ్య వాణి లాగే.. మరికొందరి పరిస్థితి ఉందన్నారు. టీడీపీ, వైసీపీ.. ఇంకే పార్టీనైనా లేడిస్‌ను పార్టీ కోసం వాడుకుని పక్కన పడేయడం సరికాదన్నారు. ప్రతివాళ్లకు గుర్తింపు ఉండాలని అన్నారు. వైసీపీలో అలకలు లేవనేది తన ఉద్దేశం కాదన్నారు. కొంతమంది యెదవల వల్ల పార్టీలు నాశనం అవుతాయని అన్నారు. పార్టీల కోసం పనిచేసేవాళ్లకు గుర్తింపు ఇవ్వాలని, పదవులలో అవకాశం ఇవ్వాలని ఆమె అన్నారు. 

తాను వైసీపీని నమ్ముకుని ఉన్నానని.. కానీ ఊరిలో గుడికి ఫండ్స్ తెచ్చుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను మర్చిపోకూడదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీలకు సపోర్ట్ చేస్తే డబ్బులు వస్తాయని కొందరు అనుకుంటారని… కానీ ఒక్క రూపాయి కూడా రావన్న సంగతి వాళ్లకు తెలియదన్నారు. తమ ఊరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం ప్రారంభించినట్టు శ్రీరెడ్డి తెలిపారు. గుడి కోసం టీడీపీ హయాంలో కొన్ని నిధులు విడుదల అయ్యాయని చెప్పారు. ఇప్పుడు గుడి సగంలో ఆగిపోయి ఉందన్నారు. 

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని తెలిపింది. తాను ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలను సంప్రదించాలని అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ హయాంలోనే కొన్ని ఫండ్స్ వచ్చాయని చెప్పారు. పార్టీ నేతల వాళ్ల జేబుల్లో నుంచి డబ్బులు పంచిపెట్టరని అన్నారు. తాను ఎంతో అసంతృప్తితో ఉన్నానని చెప్పారు. ఇన్ని రోజులు పార్టీని నమ్ముకుని ఉన్నందుకు ఒక్క రూపాయి కూడా తినకపోగా.. దేవుడి గుడిని కూడా కట్టించుకోలేకపోయానని చెప్పారు.