ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు మరణించారు. నిన్న ఖైరతాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుకు గురైన శ్రీనివాసరావు కుప్పకూలిపోయారు.

ఆయన్ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎన్టీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 1985-90 మధ్యకాలంలో శ్రీనివాసరావు ఆయనకు పీఏగా పనిచేశారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా పనిచేసిన డా. సి.నారాయణరెడ్డి వద్ద, అనంతరం ధర్మవరపు సుబ్రమణ్యం, ఆర్వీ రమణమూర్తిలకు పీఏగా సేవలందించారు. ఆయన అవివాహితుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ.. ఖైరతాబాద్‌లోని సోదరుని వద్ద ఉంటున్నారు.