భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేస్ బౌలర్ అవతారం ఎత్తారు. అదేంటి అశ్విన్ స్పిన్నర్ కదా ? అని అనుమానం వచ్చిందా? ఏం చేస్తాం..పరిస్దితులు అలా మార్చేశాయి మరి.

ఇంతకీ విషయం ఏమిటంటే, మూడు టెస్టుల సీరీస్ లో ఆడేందుకు భారత జట్టు ధక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి టెస్టులో భారత్ ఘోరంగా ఓడిపోయింది. రెండో టెస్టు శనివారం నుండి మొదలవుతోంది. సెంచూరియన్ పార్కులో మొదలయ్యే రెండో టెస్టు భయంకరమైన పేస్ బౌలింగ్ కు పెట్టింది పేరు.

అందుకనే మొదటిటెస్టులో ఆడిన అశ్విన్ను జట్టు మేనేజ్ మెంట్ పక్కన పెట్టేసింది. అంటే ఈ టెస్టులో అశ్విన్ కు పనేమీ లేదన్న మాట. అందుకని మేనేజ్ మెంటె ఏం చేసిందంటే అశ్విన్ తో స్పిన్ కాకుండా పేస్ బౌలింగ్ వేయించిందట. ఎందుకంటే బ్యాట్స్ మెన్ కు ప్రాక్టీసుగా ఉంటుందని. దాంతో అలవాటైన స్పిన్ వదిలేసి బ్యాట్స్ మెన్ కోసం నెట్స్ లో అశ్విన్ మూడు రోజులుగా పేస్ బౌలింగే వేస్తున్నాడట. ఈ విషయాన్ని, ఇందుకు సంబంధించిన వీడియోను బిసిసిఐ ట్విట్టర్లో పెట్టింది.