ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. www.childeal.com వెబ్‌సైట్ ద్వారా మందు పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెబ్‌సైట్‌ను అధికారికంగా వెల్లడించారు అధికారులు. దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీ చేయనున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ ఆవరణలో సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషధం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య. మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్‌ను నిర్మించనుండటంతో దానికి ఆనందయ్య భూమి పూజ చేశారు. రెండు రోజుల్లో షెడ్ నిర్మాణం జరగనుంది. ఇతర సదుపాయాల కల్పన సైతం పూర్తవుతోంది. 

Also Read:ఆనందయ్య మందు ఎఫెక్ట్: ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నంలోకి ఎంట్రీ

మరోవైపు ఆన్‌‌లైన్ లోనూ మందు పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బ్లూడార్ట్ కొరియర్ సంస్థతో అధికారులు మాట్లాడారు. 50 శాతం రాయితీతో సర్వీస్ ఇస్తామని బ్లూడార్ట్ సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేచోట కాకుండా మూడు నాలుగు కేంద్రాల ద్వారా మందు పంపిణీ చేసే  అంశంపై పరిశీలిస్తున్నారు. కంట్లో వేసే మందుకి తప్పిస్తే ఆనందయ్య తయారు చేసిన ఇతర మందుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.