అమరావతి : ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్స వేడుకల్లో భాగంగా ఆయన  అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేశారు.  

అనంతరం మీడియాతో మాట్లాడిన కోడెల ఈ నెల 30 నుంచి గవర్నర్‌ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ సమవేశాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో అసెంబ్లీకి సెలవు అని ప్రకటించారు. 

అనంతరం ఫిబ్రవరి 4న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.