Asianet News TeluguAsianet News Telugu

మా పోలీసుల పనితీరు భేష్... ఈ విషయాల్లో మేమే టాప్..: కృష్ణా ఎస్పీ సిద్దార్థ్ వార్షిక రివ్యూ

కృష్ణా జిల్లా పోలీసుల పనితీరును మెచ్చుకుంటూ 2021 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రివ్యూను ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ విడుదల చేసారు. 

sp siddarth koushal released krishna district police annual review
Author
Vijayawada, First Published Dec 30, 2021, 5:14 PM IST

విజయవాడ: ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ (andhra pradesh) లో అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల (sc,st atrocity cases) నమోదులో కృష్ణా జిల్లా (krishna district) మొదటి స్ధానంలో నిలిచిందని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ (siddarth koushal) వెల్లడించారు. మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశ యాప్ (disha app) డౌన్ లోడ్స్ లోనూ కృష్ణా జిల్లా (krishna district) ముందుందని ఎస్పీ తెలిపారు. ఇలా 2021 సంవత్సరంలో కృష్ణా పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబర్చారని ఎస్పీ అభినందించారు. 

గురువారం కృష్ణా జిల్లా పోలీసు వార్షిక రివ్యూ (krishna police annual review)ను ఎస్పీ సిద్దార్థ్ ప్రకటించారు. ఈ ఏడాది అనేక కేసుల్లో చాలా చార్జీషీట్లు దాఖలుచేసినట్లు... దీంతో గతేడాదితో పోలిస్తే వీటి శాతం చాలా పెరిగాయన్నారు. గతంలో ఛార్జిషీటు (charge sheet) వేయడానికి 68 రోజులు పట్టేది కానీ ఇప్పుడు కేవలం 34 రోజుల్లోనే ఛార్జిషీట్ ఫైల్ చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. 
   
జిల్లాలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ కేసులు 5,420 నమోదయ్యాయని ఎస్పీ సిద్దార్థ్ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక‌ ఎన్ ఫోర్స్ మెంట్ కేసులు కృష్ణా జిల్లాలోనే నమోదయ్యాయని తెలిపారు. ఇక ప్రొహిబిషన్ కేసులు 1,026 నమోదయ్యాయి... అంటే గతంలో కంటే 34 శాతం పెరిగినట్లు ఎస్పీ వెల్లడించారు.

read more  ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్... కోటి మంది మహిళలకు చేరువలో దిశ యాప్...: డిజిపి గౌతమ్ సవాంగ్ (Video) 

నిషేదిత గుట్కా కేసులు 1054 నమోదయినట్లు... అత్యధిక గుట్కా కేసులు కృష్ణాజిల్లాలోనే పెట్టామన్నారు. ఇక ఈ ఏడాది జిల్లాలో 3265 బైండ్ ఓవర్ కేసులు పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. బైండ్ ఓవర్ కేసుల్లో ఏపీలో కృష్ణాజిల్లా రెండవ స్ధానంలో ఉందని వెల్లడించారు. 

''హిష్టరీ షీట్లు 746 పెట్టాం. రూ.7.1కోట్ల విలువగత ప్రాపర్టీ కేసుల్లో రూ.6.5 కోట్లు రికవరీ చేసాం. లోక్ అదాలత్ (lok adalat) లో 10,460 కేసులు పరిష్కరించబడ్డాయి. మర్డర్ ఫర్ గెయిన్ 1 కేసు, రాబరీ కేసులు 1, దోపిడీ కేసులు 22, రాత్రి దొంగతనాలు 100, కిడ్నాప్ లు 151, వైట్ కాలర్ నేరాలు 432, సాధారణ కేసులు 1402 పెట్టాం'' అని ఎస్పి వెల్లడించారు. 

read more  2021 Crime Roundup: భారీగా పెరిగిన క్రైమ్ రేట్... మహిళలపై అత్యాచారాలు కూడా..: రాచకొండ సిపి వెల్లడి

ఇక మహిళలకు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని... అందులో భాగంగానే దిశ యాప్ ను వీలైనంత ఎక్కువమంది మహిళలతో డౌన్ లోడ్ చేయిస్తున్నామన్నారు. ఈ యాప్ పై మహిళలు, యువతుల్లో అవగాహన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెల్లడించారు. 

ఇక రాష్ట్ర పోలీసుల పనితీరులో చాలా మార్పులు వచ్చిందని డిజిపి గౌతమ్ సవాంగ్ ఇటీవలే పేర్కొన్నారు. ఎలాంటి నేరం జరిగినా వెంటనే ఇన్వేస్టిగేషన్ (investigation) పూర్తిచేసి ఛార్జీషీట్ (charge sheet) దాఖలు చేయడం గత ఐదు సంవత్సరాల కాలంలో 75.09 శాతం మెరుగయ్యిందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios