పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే శాంతిభద్రతలకు విఘాతం: ఎస్పీ జాషువా
గన్నవరంలో నిన్న టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణపై పోలీసులు పోస్టుమార్టం ప్రారంభించారు. పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే పరిస్థితి చేజారిందని ఎస్పీ ప్రకటించారు.
విజయవాడ:టీడీపీ నేత పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే గన్నవరంలో శాంతి భద్రతల సమస్యకు విఘాతం వాటిల్లిందని ఎస్పీ జాషువా చెప్పారు. మంగళవారం నాడు ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడారు. టీడీపీ నిర్వహించిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదన్నారు. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ల దాడిలో గన్నవరం సీఐ తలకి గాయమైందని ఎస్పీ వివరించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటనలపై సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
నాలుగైదు రోజులుగా గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. చంద్రబాబునాయుడు, లోకేష్ లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు. దీంతో తమ నేతలను వంశీ బెదిరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ విషయమై నిన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకంది. ర్యాలీగా పోలీస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు అడ్డకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యాలయంపై వంశీ వర్గీయులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయ ఆవరణలో పార్క్ చేసిన కారుకు నిప్పంటించారు.
ఈ ఘటనతో డీఎస్పీపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు దగ్గరుండి తమ పార్టీ ార్యాలయంపై దాడి చేయించారని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులపై తిరగబడ్డారు. విజయవాడ- హైద్రాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. నిన్న రాత్రి టీడీపీ నేత చిన్నా కారుకు వంశీ వర్గీయులు నిప్పంటించారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది
also read:దమ్ముంటే తేల్చుకుందాం రా: బుద్దా వెంకన్న సవాల్, వంశీ స్పందనపై ఉత్కంఠ
ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారే గన్నవరంలో గొడవలకు కారణంగా మారుతున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోపించారు. నిన్న గన్నవరంలో జరిగిన ఘటనలకు తనకు సంబంధం లేదని వంశీ ప్రకటించారు. గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో ఇవాళ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తేల్చుకుందాం రావాలని వంశీకి బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ కు రావాలని బుద్దా వెంకన్న సవాల్ చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వంశీ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. . వంశీ టీడీపీలో చేరిన నాటి నుండి ఈ నియోజకవర్గంలో టీడీపీ, వంశీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గత ఏడాదిలో ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి బచ్చుల అర్జునుడిని ఇంచార్జీగా నియమించింది టీడీపీ నాయకత్వం. ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు బచ్చుల అర్జునుడు ప్రయత్నిస్తున్నారు