Asianet News TeluguAsianet News Telugu

సోనూసూద్ : కర్నూలు, నెల్లూరుల్లో మొదటి ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటు...

కోవిడ్ -19 మహమ్మారి పోరాటంలో రియల్ హీరో సోను సూద్ మరో ముందడుగు వేశారు. ప్రస్తుతమున్న ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడానికి వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

Sonu Sood to set up his first set of  oxygen plants at Kurnool and Nellore in Andhra Pradesh, followed by other states - bsb
Author
Hyderabad, First Published May 22, 2021, 3:38 PM IST

కోవిడ్ -19 మహమ్మారి పోరాటంలో రియల్ హీరో సోను సూద్ మరో ముందడుగు వేశారు. ప్రస్తుతమున్న ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడానికి వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇప్పటికే యుఎస్, ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ ప్లాంట్లు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు.  ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తారు. మొదటి రెండు ప్లాంట్లను ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరుల్లో ఏర్పాటు చేస్తారు.

ముందుగా సోనూ సూద్, అతని బృందం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఆ తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనుంది. దీనికోసం మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా పొందారు.
 
ఈ ప్లాంట్ కర్నూలు, నెల్లూరు జిల్లాలు, వాటి పొరుగు గ్రామాలలో ఉన్న వేలాది మంది కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ ను అందించనుంది. జిల్లా కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి ఐ.ఎ.ఎస్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. “సోను సూద్ మానవత్వ ఆలోచనలకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్ వల్ల  ప్రతిరోజూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నుండి 200 మంది కోవిడ్ రోగుల చికిత్సకు ఉపయోగపడుతుంది. ” అన్నారు.

ఇక సోను సూద్ మాట్లాడుతూ, “ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఇది చాలా అవసరం.  ఈ ప్లాంట్స్ కోవిడ్ -19 తో ధైర్యంగా పోరాడటానికి అవసరమైన వారికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను.  ఆంధ్రప్రదేశ్ తరువాత, జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం.  ప్రస్తుతం, మేము వివిధ రాష్ట్రాల్లోని అత్యవసర సహాయం అవసరమైన ఆసుపత్రులను గుర్తించాం” అని తెలియజేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios