Asianet News TeluguAsianet News Telugu

పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. తాగొచ్చి, తల్లిని విచక్షణారహితంగా కాళ్లతో తొక్కి దాడి చేసిన కొడుకు...

మద్యం మత్తులో, డబ్బులు ఇవ్వాలంటూ కన్నతల్లిని కాళ్లతో తంతూ విచక్షణారహితంగా దాడి చేశాడో కిరాతకుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. 

son drunk and attacked his own mother in Kakinada
Author
First Published Sep 27, 2022, 6:45 AM IST

కాకినాడ : పించన్ డబ్బుల కోసం కన్నకొడుకే తల్లి మీద దారుణానికి తెగబడ్డాడు. వృద్ధురాలని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కాళ్లతో తన్నడంతో ఆ మాతృమూర్తి తీవ్రంగా గాయపడింది. కాకినాడ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… కాజులూరు మండలం పల్లి గ్రామానికి చెందిన తల్లి బోయిన వెంకన్న మద్యానికి బానిసయ్యాడు. పింఛన్ డబ్బులు ఇవ్వాలంటూ తరచు తల్లి లక్ష్మి(75)ను  హింసిస్తున్నాడు.  తల్లి పీక మీద కాలు వేసి తొక్కుతూ వేధిస్తున్నాడు.  

ఆదివారం ఉదయం వెంకన్న తల్లిపై దాడి చేస్తుండగా ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో కాకినాడ డిఎస్పి ఆదేశాల మేరకు పోలీసులు బాధితురాలిని యానాం ఆస్పత్రి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకన్న క్రూర చర్యలపై గతంలో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు భరోసా ఇవ్వడంతో బాధితురాలి పెద్ద కొడుకు సుబ్బారావు ఫిర్యాదు చేశాడని,  నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. 

అల్లూరి జిల్లాలో విషాదం: సోకిలేరు వాగులో ముగ్గురు గల్లంతు,రెండు మృతదేహలు వెలికితీత

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ మేలో సిద్ధిపేటలో చోటు చేసుకుంది. కన్నకొడుకే కాలయముడు అయ్యాడు. డబ్బులు ఇవ్వలేదని అక్కసు పెంచుకుని తల్లికి నిప్పంటించాడు ఓ ప్రబుద్ధుడు. అడ్డువచ్చిన తండ్రిపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ విషాద ఘటన సిద్ధిపేట, జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందపూర్ లో చోటు చేసుకుంది. గోవిందా పూర్ కి చెందిన  మైసయ్య(65), పోశవ్వ (60) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. గతంలో చిన్న కుమారుడు ఓ ప్రమాదంలో చనిపోయాడు. వీరందరికీ వివాహాలు అయ్యాయి. పెద్ద కొడుకు బాలమల్లు తల్లిదండ్రులతో కాకుండా విడిగా ఉంటున్నాడు. 

ఈ క్రమంలో మైసయ్య తనకున్న మూడు గుంటల భూమిని అమ్మగా, రెండు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ డబ్బులో లక్ష బాలమల్లుకు ఇచ్చి తన వద్ద రూ.లక్ష  ఉంచుకున్నాడు. ఆ డబ్బు కూడా ఇవ్వాలంటూ బాలమల్లు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఆరోగ్యం బాగా లేదని, ఆస్పత్రి ఖర్చులకు డబ్బు అవసరం ఉందని మైసయ్య ఎంత చెప్పినా కొడుకు వినిపించుకోలేదు. ఘటన జరిగిన రోజు ఉదయం ఇంటికి వచ్చి తల్లిని తీవ్రంగా చితకబాది ఆమె దగ్గర ఉన్న డబ్బుల సంచిని లాక్కున్నాడు. ఆ తర్వాత బైక్ లోంచి పెట్రోల్  తీసి.. తల్లిపై పోసి నిప్పంటించాడు. 

తీవ్ర గాయాలకు గురైన పోశవ్వ కేకలు వేయడంతో మైసయ్య ఇంట్లో నుంచి పరుగున వచ్చి  మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. బాలమల్లు కర్రతో తండ్రిపై కూడా దాడి చేసి గాయపరిచారు. గ్రామస్తులు 108లో వీరిద్దరిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోశవ్వ పరిస్థితి విషమంగా ఉండడంతో  ఆమెకు  మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మైసయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios