టీడీపీ నేతలపై బీజేపీ నేత సోము వీర్రాజు సంచలన కామెంట్స్ చేశారు. రాజధాని అమరావతి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.కేంద్రం ఇచ్చిన రూ.32వేల కోట్లను టీడీపీ నేతలు మింగేశారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నప్పుడు పొగుడుతూ తీర్మానాలు చేశారని, విడిపోయాక సభలో మోదీని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. 

శాసనమండలి అబద్ధాలకు నిలయంగా మారింద వీర్రాజు ఆరోపించారు. అరిగిపోయిన రికార్డులాగా పదే పదే అమరావతి పేరు చెబుతున్నారని, రాజధానికి 1500కోట్లు ఇస్తే కారిపోతున్న తాత్కాలిక భవనాలను కట్టారని, బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తే ముప్పేట దాడి చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు.
 
మండలి నుంచి సోమువీర్రాజు, కంచేటి సత్యనారాయణరాజు వాకౌట్‌ చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతిపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడంపై వీర్రాజు అభ్యంతరం తెలిపారు. రాజధానికి జరిగిన అన్యాయంపై ప్రస్తావించడంలో టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, మాణిక్య వరప్రసాద్‌ తప్పులేదన్నారు.