ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. కాంగ్రెస్‌ను బతికించేందుకు చంద్రబాబు ప్రయత్రిస్తున్నారని.. దీనిలో భాగంగానే తెలంగాణలో ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తిని కాంగ్రెస్‌లోకి పంపారని ఆరోపించారు.

కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని.. ఎన్టీఆర్ ఆశయాలను కాలరాసేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నరాని విమర్శించారు. బాబు ఊసరవెల్లి రాజకీయాలను నడుపుతున్నారని.. ఆయన అవినీతికి చరమగీతం పాడబోతున్నామని తెలిపారు.

పోలవరం, ఇళ్ల నిర్మాణం, టాయిలెట్ల నిర్మాణం ఇలా ప్రతి పనిలో అవినీతేనని ఆరోపించారు. సీఎం రాష్ట్రంలో ఇసుక మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.