బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై మండిపడ్డారు. మోదీ నైతికతకు..చంద్రబాబు అనైతికతకు చిహ్నమని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు వ్యాఖ్యానించారు. 

శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అని అన్నారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేయటం వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక నుంచి ప్రభుత్వ పథకాల్లో జరిగే అవినీతిపై ఉద్యమం చేపడతామన్నారు. ఔట్‌ట్ సోర్సింగ్ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.