బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోము వీర్రాజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలవుతుందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఆదివారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోము వీర్రాజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం రూ. 15 వేల కోట్లతో ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఆరు ప్రాజెక్టులు కావాలని కేంద్రాన్ని అడిగారని చెప్పారు. కేంద్రం పోలవరానికి రూ. 55 వేల కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ. 70 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం అందించిందన్నారు

రాయలసీమ నుంచి అమరావతి కలిపేందుకు ఆరు లైన్లు, 4 లెన్లతో జాతీయ రహదారి నిర్మాణం చేయబడుతున్నామని చెప్పారు. కడప, కర్నూల్ లో ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నామని తెలిపారు. పోలవరంతో పాటు రాయలసీమ పెండింగ్‌ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ పాలనలో దేశం ఆర్ధికంగా పురోభివృద్ధి చెందుతుంటే జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు అవుతోందని ఆరోపించారు. 

అన్నమయ్య జిల్లాలో టమాటా, చిత్తూరు జిల్లాలో మామిడి, చింతపండు వాణిజ్య పంటలకు ధరలు తగ్గిపోతుంటే ప్రత్యామ్నయం ఆలోచించాల్సిన ప్రభుత్వం... ఎర్ర చందనం విక్రయానికి ప్రత్యామ్నాయం చూస్తోందని విమర్శించారు. టీడీపీ, వైసీపీలు పోలవరం మీద దృష్టి పెట్టాయని.. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు వైపు దృష్టి పెట్టలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శించారు.