వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు బిజెపి జనసేన వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు.. అంటూ విజయసాయి చేసిన ట్వీట్ కు అంతే స్థాయిలో కౌంటర్ ట్వీట్ చేశారు సోము వీర్రాజు.

’మా ఊసు ఎందుకులే.. కోర్టులకు చెవుల్లో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా.. లోపల గోళ్లు కోరుకుంటున్నారంటగా.. ఆలీబాబా 40 దొంగలంతా’ అంటూ సెటైర్ వేశారు. తిరుపతి ప్రజలకీ తామేమీ ఇచ్చామో.. చెప్పి క్యాబేజీ పువ్వులు పంపిస్తామని, బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయని ఘాటుగా రిప్లై ఇచ్చారు.

 విజయ సాయి తన ట్వీట్ లో... ‘తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడు అన్నట్లుగా నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి.. చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసిపినే దీవిస్తారు’ అని పేర్కొన్నారు.