జగన్ పార్టీలోకి సోము వీర్రాజు ...: టీడీపి వాదన నిజమవుతుందా ?

First Published 14, May 2018, 2:49 PM IST
Somu veerraju joining ysrcp
Highlights

జగన్ పార్టీలోకి సోము వీర్రాజు ...: టీడీపి వాదన నిజమవుతుందా ?

అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ ద్వితియ శ్రేణి నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దశాబ్దాల తరబడి పార్టీలో ఉన్న తమను కాదని సమీకరణాల పేరుతో ఇతరులకు పదవులు ఎలా కట్టబెడుతారంటూ ఢిల్లీనేతలను ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి.  గడచిన నాలుగేళ్లలో టీడీపీపై దూకుడు ప్రదర్శించడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్త్రతంగా ప్రచారం చేయడంలో ముందు ఉండటం, ప్రధాని మోదీపై ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉండటంతో అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని ఆయన వర్గం భావించింది. 

 

కన్నాకు బాధ్యతలు ఇవ్వడంపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు వర్గం ఆగ్రహంతో ఉంది. కన్నాకు పార్టీ చీఫ్ పదవి ఇవ్వడంతో సోము వీర్రాజు కినుక వహించారు. ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. పార్టీ మారే వ్యక్తికి పదవులు ఇవ్వడం ఏమిటని అసంతృప్తితో ఉన్నారు.కాగా, కన్నా లక్మీనారాయణ ఇటీవల వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం సాగింది. అయితే, అనారోగ్యం కారణంగా ఆయన చేరిక వాయిదా పడింది. కానీ హఠాత్తుగా మళ్లీ ఆయనను పార్టీ చీఫ్‌గా చేశారు. దీంతో పార్టీ చీఫ్ పదవి తనకు వస్తుందని సోము వీర్రాజు చాలా కాలంగా వేచిచూస్తున్న రాక‌పోవ‌డంతో వైసీపీలోకి వెళ్లాలని అనుకున్న‌ట్లు స‌మ‌చారం. మ‌రి కొన్ని రోజుల్లో త‌మ నాయ‌కులు,కార్య‌క‌ర్త‌లో క‌ల‌సి ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ఒక వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 

loader