ఏది జరగాలో అదే జరుగుతుంది: బాబుపై సోము తీవ్ర వ్యాఖ్యలు

Somu Veeraraju says Chandrababu is corrupt
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నేత సోము వీర్రాజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నేత సోము వీర్రాజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ఏం జరగాలో అదే జరుగుతుందని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. 

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై రోజుకోసారి లెక్కలు మారుతున్నాయని ఆయన అన్నారు. దోపిడీ చేయడానికి చంద్రబాబుకు గునపాలు సరిపోవని, ప్రోక్లెయినర్లు కావాలని అన్నారు. 

పోలవరం అంచనా వ్యయం 16 వేల కోట్ల రూపాయల నుంచి 53 వేల కోట్ల రూపాయలకు ఎలా మారిందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. 

చంద్రబాబు అధర్మ చక్రవర్తి, అధర్మ పోరాటం చేస్తారని అన్నారు. విభజన హామీలకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 

loader