న్యాయం చేయాల్సిన పోలీసులే దాడులు, అక్రమ కేసులతో అమాయకులను వేధించడం దుర్మార్గమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

నెల్లూరు: పరిధి దాటి వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు జిల్లా ఎస్పీని కోరారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ఎస్సీకి లేఖ రాశారు. న్యాయం చేయాల్సిన పోలీసులే దాడులు, అక్రమ కేసులతో అమాయకులను వేధించడం దుర్మార్గమని సోమిరెడ్డి పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''కొడవలూరు ఎస్సై టీడీపీ సానుభూతిపరులను వైసీపీ నేత గెస్ట్ హౌస్ కి పిలిపించి వారి సమక్షంలో కొడుతుండటం అమానుషం. వైసీపీ నేత పిలిస్తే వెళ్లి కలవలేదని టీడీపీ సానుభూతిపరుడు ఒబ్బాని శ్రీనివాసులును కులం పేరుతో దూషించి, లాఠీలు విరిగేలా కొట్టడం దురదృష్టకరం. దాడులకు పాల్పడటమే గాక తిరిగి బాధితులపైనే కేసులు పెడతారా..? కొడవలూరు ఎస్సైపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి'' అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

read more ఆ కార్మికుల ఊపిరి తీయాలన్నదే జగన్ కుట్ర...: నారా లోకేష్ సీరియస్

''ఇలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతో అఖిలపక్షంతో కలిసి స్టేషన్ల ముట్టడికి వెనుకాడబోము. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతున్నాం'' అంటూ సోమిరెడ్డి ఎస్పీకి లేఖ రాశారు.