కడప జిల్లా బద్వేలు మండల పరిధిలోని గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి (32) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అతను మరణించాడు.

కడప: కడప జిల్లా బద్వేలు మండల పరిధిలోని గొడుగునూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి (32) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అతను మరణించాడు.

భూమిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నరసమ్మలకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. రెండో సంతానమైన వెంకటసుబ్బారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 

ఈయనకు 13 నెలల క్రితం బి.మఠం మండలం గంగిరెడ్డిపల్లెకు చెందిన స్వర్ణలతతో పెళ్లయింది. ఆమె కూడా హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బుధవారం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి చేరుకున్న వెంకటసుబ్బారెడ్డి కాపేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. 

కొన్ని నెలలుగా భార్యభర్తల మధ్య ఏర్పడిన విబేధాల వల్ల ఇరువురు వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తన భార్యను కాపురానికి రావాలని అతను అడుగుతున్నాడు. కానీ ఆమె రాకుండా వేధింపులకు గురి చేస్తుండేదని, అందుకే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.