స్నేహలత హత్యకు సీఐ ప్రతాప్‌రెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తప్పుబట్టారు. 

పోలీసులు స్పందించి ఉంటే స్నేహలత హత్య జరిగేది కాదన్నారు. సీఐ ప్రతాప్‌రెడ్డిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఘటనపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు. 

మహిళలపై దాడులను అరికట్టకపోతే.. ప్రభుత్వం దిగొచ్చేలా ప్రజా ఉద్యమం చేస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.అంతకుముందు ప్రేమోన్మాదానికి బలి అయిన స్నేహలత కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాల నేతలు నిరసనకు దిగారు. 

జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం నుంచి హత్యకు గురైన స్నేహలత ఇంటి వరకు దళిత సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. మందకృష్ణ మాదిగ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.