నెల్లూరు జిల్లాలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపింది. చెన్నై నుంచి ఢిల్లీ హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ నుంచి పొగలు వచ్చాయి. 

నెల్లూరు జిల్లాలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపింది. చెన్నై నుంచి ఢిల్లీ హజరత్‌ నిజాముద్దీన్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ నుంచి పొగలు వచ్చాయి. కావలి రైల్వే స్టేషన్‌లో బీ-5 బోగీలో నుంచి పొగలు రావడం గుర్తించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. 

పొగలు చెలరేగడానికి కారణాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది.. వెంటనే మరమ్మతులు చేశారు. దీంతో కావలి స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌‌ను కొంతసేపు నిలిచిపోయింది. అయితే బ్రేకులు ఫెయిల్ కావడంతో పొగలు వచ్చినట్టుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనతో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.