Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సంక్రాంత్రి సెలవుల్లో స్వల్ప మార్పులు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్రాంత్రి సెల‌వుల్లో స్వ‌ల్ప మార్పులు చేసింది.13,14,15వ తేదీలను ప్రభుత్వం సెలవులుగా ప్రకటించింది. గతంలో 14,15,16వ తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. 

 

Slight changes in AP Sankranthi holidays ...
Author
Amaravathi, First Published Jan 11, 2022, 7:56 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (andrapradhesh) రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్రాంత్రి (sankrantri) సెల‌వుల్లో స్వ‌ల్ప మార్పులు చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ తాజా ఉత్త‌ర్వుల ప్రకారం.. ఉద్యోగులకు ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వ‌ర‌కు సెల‌వులు ఉంటాయి. అయితే గ‌తంలో 14,15,16వ తేదీల‌ను సెలువులుగా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు ఒక రోజు ముందుకు జ‌రిపి 13,14,15 తేదీల‌ను సెలవుల‌గా నిర్ణ‌యించింది. అయితే 16వ తేదీ రోజు ఆదివారం కావ‌డంతో ఉద్యోగుల‌కు మ‌రొక‌రోజు సెలవు క‌లిసి రానుంది. 

ఏపీలో 18వ తేదీ నుంచి నైట్ క‌ర్ఫ్యూ (night curfew) అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ కొత్త ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. పెరుగుతున్న క‌రోనా కేసుల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేయ‌నుంది. ఈ కర్ప్యూ ఈ నెలాఖ‌రు వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంది. దీంతో పాటు ప్ర‌భుత్వం మ‌రి కొన్ని ఆంక్ష‌ల‌ను కూడా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. 

మ‌రో వైపు సంక్రాంతి పండ‌గ‌కు ఇంటికి వెళ్లేందుకు హైద‌రాబాద్ (hydarbad) ప్ర‌జ‌లు ప‌ల్లె బాట ప‌ట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంక్రాత్రి పండ‌గ‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తారు. గ‌త రెండు రోజుల నుంచి హైద‌రాబాద్ నుంచి ప‌ల్లెల‌కు ప్ర‌యాణం మొద‌లుపెట్టారు.  అయితే సంక్రాంతి పర్వదినం పూర్తైన తర్వాత తిరిగి హైద్రాబాద్ కు పెద్ద ఎత్తున వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios