పోలీస్ స్టేషన్ లో పెచ్చులూడిపడి ఓ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. 

ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లోపల శ్లాబ్ పెచ్చులూడి పడటంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. సీఐ కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. పాఠశాలకు పండుగ సెలవులు కావడంతో సోమవారం సీఎం రమేష్ తన నాలుగేళ్ల కుమార్తె మోక్షితను తీసుకుని ఉదయం కార్యాలయానికి వచ్చారు. కార్యాలయం మధ్య గదిలో కానిస్టేబుల్ తో పాటు సీఐ కుమార్తె కూర్చున్నారు.

అదే సమయంలో కానిస్టేబుల్ జమలయ్య కూర్చున్న ప్రాంతంలో స్లాబ్ నుంచి సీలింగ్ ప్రాంతాన్ని పెద్దపెద్ద పెచ్చులూడి పడడంతో ఆయన తలపై గాయాలయ్యాయి. కొన్ని పెచ్చులు సీఐ కుమార్తె కూర్చున్న కుర్చీపై పడడంతో బాలికకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. మొదట స్థానిక బస్టాండ్ పక్కన పోలీస్ స్టేషన్ ఉండేది. మూడున్నరేళ్ల కిందట కొత్త భవనాన్ని నిర్మించి పోలీస్ స్టేషన్కు తరలించారు. 

మోడీ ఏపీ టూర్ ఖరారు: నవంబర్ 11న విశాఖపట్టణంలో పీఎం పర్యటన

బస్టాండ్ పక్కనున్న స్టేషన్ భవనానికి తాత్కాలిక మరమ్మత్తులు చేయించి సీఐ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. గతంలోనే శ్లాబ్ పాడవడంతో తాత్కాలికంగా మరమ్మత్తులు చేయించారు. భవనం దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చి ఖాళీ చేస్తామని సీఐ రమేష్ చెప్పారు.