విషాదం.. రూ.2 కోసం ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
పాకెట్ మనీ అడిగితే తల్లి ఇవ్వలేదని ఓ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అనంతపురంలో వెలుగు చూసింది.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, కనగానపల్లిలో ఓ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రూ.2 కోసం ఓ ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్కూలుకు వెడుతూ తల్లిని పాకెట్ మనీ రూ.2 ఇవ్వమని అడిగాడు. దీనికి తల్లి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంట్లోనుంచి డబ్బులు తీసుకుని వచ్చిన తల్లి అది చూసి షాక్ అయ్యింది. డబ్బులు తీసుకుని వచ్చేలోపే కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడని హృదయవిదారకంగా రోదిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.