ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఒక్కరోజే ఇద్దరు ఆరేళ్ల వయసు గల చిన్నారులపై అత్యాచారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు లో ఒకటి, చిత్తూరు జిల్ల పెద్ద పంజాణిలో మరొక చిన్నారి ఈ దారుణానికి బలయ్యారు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ ఊర్లో మేనమామ ఇంటికి వచ్చిన 14యేళ్ల బాలుడు స్థానికంగా ఉన్న ఓ ఆరేళ్ల పాపను డాబా మీదికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలిక కేకలు విని మిగతా పిల్లలు రావడంతో ఆ బాలుడు పారిపోయాడు. చిన్నారిని ఏలేశ్వరం సీహెచ్ సీకి వైద్యం కోసం తరలించారు. 

మరో ఘటనలో చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలంలో ఒంటరిగా ఇంటివద్ద ఉన్న చిన్నారిని గమనించిన అదే గ్రామానికి చెందిన మహేష్ అనే 28 యేళ్ల యువకుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. నిద్రపోయే సమయంలో చిన్నారికి తీవ్రరక్తస్రావం కావడంతో ఆరా తీసిన తల్లిదండ్రులకు విషయం తెలిసింది.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. చిన్నారిని పలమనేరు ప్రభుతాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.