శ్రీకాకుళం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మందస మండలం కొత్తపల్లి వద్ద ఉన్న వంతెన పై నుంచి ఓ కారు కిందకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. 

మృతులను ఒడిసా వాసులుగా గుర్తించారు. కారు విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళుతోంది. సింహాచలం ఆలయానికి వెళ్లి... తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి  చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీసి... పోస్టు మార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు  పోలీసులు చెప్పారు.