విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని జనభ వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికులు కోరుకొండ సంతకు వెళ్లి వస్తుండగా ఆటో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు  తీవ్రంగా గాయపడ్డారు.  విద్యుత్ స్థంభాన్ని ఆటో ఢీకొట్టడంతో ఆటోకు మంటలు అంటుకొన్నాయి.దీంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.