ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

విశాఖ జిల్లా పెందుర్తి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద వీరు ప్రయాణీస్తున్న వ్యాన్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకొంది.

క్షతగాత్రుల్లో ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.