వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: పరమేశ్వర్ రెడ్డితో టీడీపీ ఎమ్మెల్సీ భేటీ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఓ ఎమ్మెల్సీతో పరమేశ్వర్ రెడ్డి భేటీ అయినట్టుగా సిట్ అనుమానాలను వ్యక్తం చేస్తోంది.

SIT Team suspect TDP MLC meeting with parameshwar reddy before ys vivekananda reddy murder


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్  దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో  ఇప్పటికే సిట్ కొందరిని  విచారిస్తోంది.  

మాజీ మంత్రి వివేకానందరెడ్డి  హత్య కేసులో ఇప్పటికే కొన్ని పార్టీలకు చెందిన నేతలను కూడ సిట్ బృందం విచారించింది. తాజాగా కడపలోని  ఓ హోటల్‌లో  ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్సీతో పరమేశ్వర్ రెడ్డి సమావేశమైనట్టుగా సిట్ అనుమానిస్తోంది. ఈ విషయమై సిట్ హరిత హోటల్‌ సీసీటీవి పుటేజీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Also read: వైఎస్ వివేకా హత్య: హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరగడానికి ముందు మార్చి 14వ తేదీనే హోటల్‌లోని 102 నెంబర్ రూమ్‌లో ఎమ్మెల్సీతో పరమేశ్వరీ రెడ్డి భేటీ అయినట్టుగా సిట్ అనుమానిస్తోంది. అయితే హోటల్ రికార్డుల్లో మాత్రం వీరిద్దరి పేర్లు నమోదు కాలేదు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందే పరమేశ్వర్ రెడ్డి సన్‌రైజ్ ఆసుపత్రిలో చేరారు. ఆనారోగ్య కారణంతోనే పరమేశ్వర్ రెడ్డి కడప సన్‌రైజ్ ఆసుపత్రిలో చేరాడు.  

Alsor read:వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్: హైకోర్టులో టీడీపీ ఎమ్మెల్సీ పిటిషన్

అయితే సన్ రైజ్ ఆసుపత్రి సిబ్బందిని కూడ ఇటీవలనే సిట్ బృందం విచారణ చేసింది. అయితే హోటల్ లో సీసీపుటేజీ లేదని సిట్ బృందానికి హోటల్ యాజమాన్యం సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ప్రసారం చేసింది. 

ఎమ్మెల్సీతో పరమేశ్వర్ రెడ్డి ఎందుకు సమావేశమయ్యారనే విషయమై సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది.  మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో  పరమేశ్వర్ రెడ్డిని సిట్ బృందం ఇప్పటికే విచారించింది.

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడ సిట్ బృందం విచారించింది. ఈ కేసులో వాస్తవాలను తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని బీటెక్ రవి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios