చిత్తూరు జిల్లా కలికిరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు  సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


చిత్తూరు: చిత్తూరు జిల్లా కలికిరిలో ఇద్దరు అక్కా చెల్లెళ్లు సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరేసుకొని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

మదనపల్లిలో నర్సింగ్ చదువుతున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయం అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 

అయితే అక్కాచెల్లెళ్లు ఎందుకు ఆత్మహత్య వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా... అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.