నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు వైసీపి నుండి నామీనేష‌న్ దాఖ‌లైంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు.  ఈ రోజు ఉదయం ఆయన తన ఇంటి వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో  కలిసి ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఆయ‌న నేడు రెండు సెట్ల నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.

నామినేష‌న్ అనంతరం శిల్పా మోహన్‌ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ. వైసీపి నుండి త‌న‌ను అభ్య‌ర్థిగా అవ‌కాశం ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. జ‌గ‌న్ త‌న పైన ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతాన‌ని ఆయ‌న ఈ 
సంధ‌ర్భంగా పెర్కొన్నారు. 2019 వైసీపి విజ‌యం త‌న‌ గెలుపుతో ప్రారంభిస్తాన‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.