సింగనమల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

1967లో ఏర్పడిన శింగనమల నియోజకవర్గం తొలినాళ్లలో జనరల్‌ స్థానం. అయితే 1978లో దీనిని ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకు శింగనమల కంచుకోట వంటిది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు, టీడీపీ 5 సార్లు, ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి శింగనమలలో విజయం సాధించాయి. 

Singanamala Assembly Election Counting and Results 2024 Live dtr

అనంతపురం జిల్లా శింగనమలకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానముంది. ముఖ్యంగా ఎన్నికల రోజున ఖచ్చితంగా ఈ నియోజకవర్గం రిజల్ట్ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 40 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది.

1983లో టీడీపీ ఆవిర్భావించాక జరిగిన ఎన్నికల్లో శింగనమల నుంచి ఆ పార్టీ తరపున పీ గురుమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అన్న నందమూరి తారకరామారావు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. ఇక అక్కడి నుంచి 2019 వరకు ఇదే సెంటిమెంట్ శింగనమలలో రిపీట్ అయ్యింది. అంతేకాదు పార్టీలు మారి పోటీ చేసిన వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల స్టైల్. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, కమ్యూనిస్ట్ నేత తరిమెల నాగిరెడ్డిలు ఈ నియోజకవర్గానికి చెందినవారే కావడం విశేషం. 

శింగనమల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. 40 ఏళ్లుగా నిజమవుతున్న సెంటిమెంట్ :

1967లో ఏర్పడిన శింగనమల నియోజకవర్గం తొలినాళ్లలో జనరల్‌ స్థానం. అయితే 1978లో దీనిని ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ప్రకటించారు. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకు శింగనమల కంచుకోట వంటిది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు, టీడీపీ 5 సార్లు, ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి శింగనమలలో విజయం సాధించాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో గార్లదిన్నె, శింగనమల, పొట్లూరు, ఎల్లనూరు, నార్పల, బీకే సముద్రం మండలాలున్నాయి. శింగనమలలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,35,064 మంది. 2019లో వైసీపీ అభ్యర్ధి జొన్నలగడ్డ పద్మావతికి 1,18,044 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి బండారు శ్రావణిశ్రీకి 71,802 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 46,242 ఓట్ల తేడాతో విజయం సాధించింది.

శింగనమల శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. పద్మావతికి టికెట్ నిరాకరించిన జగన్ : 

2024 ఎన్నికల విషయానికి వస్తే .. శింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి జగన్ టికెట్ నిరాకరించారు. దీంతో ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. ఐదేళ్లుగా తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని.. తన నియోజకవర్గంలో అభివృద్ది జరగకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని పద్మావతి ఆరోపించారు. అయినప్పటికీ తనకు జగనన్నే మాటే శిరోధార్యమని పేర్కొన్నారు. శింగనమలలో పట్టు నిలుపుకోవాలని ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో వున్నారు. ఈ నేపథ్యంలో ఎం వీరాంజనేయులను వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు. టీడీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన శ్రావణిశ్రీకి మరోసారి అవకాశం కల్పించారు చంద్రబాబు . 

 శింగనమల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలాలు ఇవే.   

1. గార్లదిన్నె 

2. శింగనమల 

3. పుట్లూర్ 

4. ఎల్లనూర్ 

5. నార్పల 

6. బికె సముద్రం  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios