Asianet News TeluguAsianet News Telugu

సింహాచలం దేవస్థానానికి ‘‘ఐఎస్‌ఓ’’ గుర్తింపు

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) 9001:2015 సర్టిఫికెట్ లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని HYM international Certifications సంస్థ ఈ గుర్తింపునిచ్చింది

simhachalam temple got international recognition
Author
Simhachalam, First Published Sep 11, 2021, 8:33 PM IST

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ) 9001:2015 సర్టిఫికెట్ లభించింది. ఆలయానికి చెందిన అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని HYM international Certifications సంస్థ ఈ గుర్తింపునిచ్చింది.  ఈ సర్టిఫికెట్ ను... రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, దేవస్థానం ఈవో సూర్యకళ శనివారం అందుకున్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఉద్యోగుల నాణ్యమైన సేవలు, పరిశుభ్రత, పచ్చదనంలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ గుర్తింపు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు నాణ్యమైన సేవలందిచడంతోపాటు... హిందూ ధర్మాన్ని , సంస్కృతిని సింహాచలం దేవస్థానం ప్రమోట్ చేస్తోందని సర్టిఫికెట్ లో పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. "ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చేలా కృషిచేసిన దేవస్థానం ఈవో సూర్యకళ, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఒక సంస్థ మెయింటెయిన్ చేసే స్టాండర్డ్స్ ఆధారంగా ఇస్తారని.. ఈవో , ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేసి దీన్ని సాధించారని మంత్రి కొనియాడారు. ప్రసాద్ స్కీం ద్వారా 54 కోట్లు మంజూరయ్యాయని.. కరోనా సెకెండ్ వేవ్ వల్ల కొంత ఆలస్యమైందని.. ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని శ్రీనివాస్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios