విశాఖ :  సింహాచలం దేవస్థానం  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవాన్ని నిరాండబరంగా నిర్వహించారు. భక్తులు లేకుండా చందనోత్సవం నిర్వహించడం ఆలయ చరిత్రలో ఇదే ప్రథమం. లాక్ డౌన్ నేపథ్యంలో భక్తులు ఎవరికీ కూడ చందనోత్సవంలో పాల్గొనే అవకాశం లేకుండాపోయింది.

 ఆలయ ధర్మకర్త సంచయిత గజపతితో పాటు  ఎంపిక చేసిన ఆలయ అధికారులు, పూజారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి నిజరూపాన్ని ధర్మకర్త రచయిత గజపతిరాజు దర్శించుకున్నారు.ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించిన భక్తులకు  గోత్రనామాలతో అర్చకులు పూజలు నిర్వహించారు.

ప్రతి ఏటా సింహాద్రి అప్పన్న లక్ష్మీనరసింహస్వామి కార్యక్రమంలో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొంటారు. ఈసారి భక్తులు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.చందనోత్సవాన్ని పురస్కరించుకొని  ఆలయ ఈవో  వెంకటేశ్వరరావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.సాయంత్రం సాయంత్రం పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

ఈ నెల 2వ తేదీన శ్రీరామనవమిని పురస్కరించుకొని  తెలంగాణలోని భద్రాచలం ఆలయంలో కూడ భక్తులు లేకుండా శ్రీ సీతారామకళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమల  వెంకన్న దర్శనాన్ని కూడ భక్తులకు నిలిపివేశారు. ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి భక్తులకు దర్శనం నిలిపివేశారు.