Asianet News TeluguAsianet News Telugu

కీచక ఎస్సై, యువ జంటను బెదిరించి యువతిపై లైంగిక దాడి

యువ జంటను లాడ్జి లో చూసిన ఒక ఎస్సై వారిపై కేసు నమోదు చేస్తానని బెదిరించి వారినుంచి డబ్బు డిమాండ్ చేసాడు. కాళ్లావేళ్లా బ్రతిమిలాడినా ఆయువకుడు 10 వేలు కాదని 5వేలకు ఒప్పందం కుదుర్చుకొని డబ్బు తేవడానికి ఎటిఎం కి వెళ్ళాడు. ఈలోపల ఆ యువతిపై లైంగిక  పాల్పడ్డాడు ఆ కీచక ఎస్సై. 

SI Threatens Young Couple And Sexually Abuses The Girl
Author
Amaravati, First Published Jun 10, 2020, 10:27 AM IST

ఒక యువ జంటను లాడ్జి లో చూసిన ఒక ఎస్సై వారిపై కేసు నమోదు చేస్తానని బెదిరించి వారినుంచి డబ్బు డిమాండ్ చేసాడు. కాళ్లావేళ్లా బ్రతిమిలాడినా ఆయువకుడు 10 వేలు కాదని 5వేలకు ఒప్పందం కుదుర్చుకొని డబ్బు తేవడానికి ఎటిఎం కి వెళ్ళాడు. ఈలోపల ఆ యువతిపై లైంగిక  పాల్పడ్డాడు ఆ కీచక ఎస్సై. 

వివరాల్లోకి వెళితే...  గుంటూరు జిల్లాకు చెందిన జంట సోమవారం అమరావతిలోని లాడ్జీకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అమరావతి ఎస్‌ఐ రామాంజనేయులు తన ప్రైవేట్‌ డ్రైవర్‌తో కలిసి వాహనంలో అక్కడకు చేరుకొని, అరెస్టు చేస్తానంటూ ఆ జంటను బెదిరించారు. 

ఎస్సై బెదిరింపులకు భయపడిపోయిన ఆ యువ జంట ఆ ఎస్సైని బ్రతిమిలాడారు. తమను అరెస్ట్ చేయొద్దంటూ ప్రాధేయపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆ ఎస్సై వారి వద్దనుండి 10వేలను డిమాండ్ చేసాడు. 

తన వద్ద అంత లేవని 5,000 మాత్రమే ఇచ్చుకోగలనని అన్నాడు. ప్రస్తుతం మూడు వేలు ఉన్నాయని, ఎటిఎం కి వెళ్లి మరో రెండు వేలను డ్రా చేసుకొని వస్తానని అన్నాడు. ఎస్సై, డ్రైవర్ ఆ డబ్బులను గుంజుకొని రెండు వేలు తీసుకురమ్మని ఆదేశించారు. 

ఆ యువకుడిని వెంటపెట్టుకొని సదరు ఎస్సై డ్రైవరు ఏటీఎం వద్దకు వెళ్లాడు. ఇక్కడ మిషన్‌ పనిచేయడం లేదని అక్కడకు అక్కడి నుండి వేరే చోటికి తిప్పారు. ఈ తతంగం అంతా దాదాపుగా అరగంటపాటు సాగింది. 

ఆ యువకుడు మాత్రమే వెళ్లడంతో ఆ యువతి ఒక్కతే లాడ్జిలో ఉంది. అదే రూమ్ లో ఉన్న ఎస్సై ఆయువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ యువతి చెయ్యిపట్టుకొని తన కోరిక తీర్చమని ఆ యువతిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను మాటలతో మానసికంగా కూడా హింసించాడు. 

ఇంతలోనే అక్కడకు చేరుకున్న ఆ యువకుడు ఆ ఎస్సైని అడ్డుకోవడంతో, ఆ ఎస్సై, అతని డ్రైవర్ వారిద్దరిని అక్కడి నుంచి గెంటేశారు. అక్కడినుండి నేరుగా ఆ జంట పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. తెల్లారి డీఎస్పీని కూడా కలిసి తమ బాధను విన్నవించుకున్నారు.  

విచారణ జరిపిన డిఎస్పీ ఆ పోలీసు గత చరిత్రను కూడా ఆరాతీసింది. హోటల్ సీసీటీవీలో ఆ యువతీయువకులను ఎస్సై ఇబ్బందిపెట్టినట్టు గుర్తించగా, పాత రికార్డులను పరిశీలిస్తే అతడు అక్కడ రోజు ఉంటున్నట్టు గుర్తించారు. 

ఆ ఎస్సై ఇక్కడ రోజు ఉంటాడని, డ్యూటీకి వెళ్లకుండా ఇలా లాడ్జిలో ఉంటూ అటువైపుగా వచ్చే జంటల దగ్గర వసూళ్లకు పాల్పడుతాడని తెలియవస్తుంది. ఆ ఎస్సై తన వద్ద నేరచరిత్ర కలిగిన ఒక వ్యక్తిని తన వద్ద డ్రైవర్ గా నియమించుకున్నాడు. ఇద్దరు కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ ఎస్సైని ఐజీ సస్పెండ్ చేసారు. పూర్తివిచారణ కొనసాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios