శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో అమ్మాయిలతో కలిసి ఎస్సై డ్యాన్స్ చేయడం కలకలం రేపుతోంది. అశ్లీల నృత్యాలను అడ్డుకోవాల్సిన ఎస్సై ఇలా వారితో కలిసి డ్యాన్సులు చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్‌లపై దుమారం రేగుతోంది. ఈ వేడుకలకు బందోబస్తు కోసం వచ్చిన ఎస్సై హరికృష్ణ.. తాను డ్యూటీలో వున్న విషయం మరిచిపోయి మరి అమ్మాయిలతో కలిసి డ్యాన్సులు వేశారు. ఈ అశ్లీల నృత్యాలను అడ్డుకోవాల్సిన ఎస్సై ఇలా వారితో కలిసి డ్యాన్సులు చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. తెలంగాణలోని వనస్థలిపురం పీఎస్ పరిధిలో మరో సీఐ అక్రమ సంబంధం బాగోతం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. పెళ్లై, పిల్లలున్న సీఐ రాజు మరో మహిళతో కారులో ఏకాంతంగా ఉండగా.. అతని భార్య, పిల్లలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాజీ సీఐ నాగేశ్వరరావు ఉదంతం మరువక ముందే మరో ఇన్ స్పెక్టర్ నిర్వాకం ఇలా వెలుగులోకి వచ్చింది. భార్య తనకు న్యాయం చేయాలంటూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది.
కొద్ది కాలంగా భర్త ప్రవర్తన మీద అనుమానం వచ్చిన భార్య.. అతడిని రహస్యంగా ఫాలో అవుతోంది. అలాగే గత రాత్రి కూడా ప్రియురాలితో కారులో వెడుతున్న భర్తను పిల్లలతో సహా ఫాలో అయ్యింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళతో గుర్రం గూడ సమీపంలోని చెట్లలో అర్థరాత్రి కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో.. పిల్లలతో కలిసి ఫాలో చేసి వెళ్లిన భార్య... పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్స్ సహాయంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
Also REad;అర్థరాత్రి కారులో మరో మహిళతో సీఐ రాజు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుున్న భార్య, పిల్లలు...
కాగా, విషయం బయటపడడంతో సిఐ రాజు పెట్రోలింగ్ కానిస్టేబుల్స్ మీద దాడికి దిగాడు. తాను సీఐనని దబాయించాడు. రాజు హైదరాబాద్ లో సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చెట్లలో పిల్లల అరుపులు వినిపించడంలో వనస్థలిపురం పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్లగా విషయం తెలిసింది.
కానిస్టేబుల్స్ ఇన్స్పెక్టర్ ని ఇదేం పని అని అడగటంతో.. రాజు వారిమీద దాడికి దిగాడు. ఇన్స్పెక్టర్ రాజు సొంత ఊరు కందుకూరు మండలం, బేగంపేట. రాజుకి భార్య, ఒక పాప ఒక బాబు ఉన్నారు. సీఐ రాజు దాడి చేయటంతో వనస్థలిపురం కానిస్టేబుల్ రామకృష్ణ, హోం గార్డ్ నాగార్జున నాయుడులు గాయపడ్డారు. గత రాత్రి ఇన్స్పెక్టర్ రాజుని అరెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కి తరలించారు. అయితే దీనికి రాజు సపోర్ట్ చేయలేదు. ఆ తరువాత 2002 బ్యాచ్ కి చెందిన రాజు అనే ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ లోని ఎస్ బీ విభాగంలో సీఐ రాజు పనిచేస్తున్నాడు. మునగోడు ఎన్నికల విధులకు హాజరై, తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
