Asianet News TeluguAsianet News Telugu

యువకుడి ఆత్మహత్య.. ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్

యువకుడి మరణానికి కారణమైన కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రసాద్, విధుల  పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ దుర్గా ప్రసాద్ లపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు.  

SI and Constable suspended after Youth commits Suicide in Raja Mahendravaram
Author
Hyderabad, First Published Aug 12, 2021, 9:44 AM IST

పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఆ యువకుడి ఆత్మహత్యకు కారణంగా భావిస్తూ..  ఎస్ఐ, ఓ కానిస్టేబుల్ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజమహేంద్రవరానికి చెందిన పిచ్చుక మజ్జి పై గతేడాది అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడనే కారణంతో చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే.. అరెస్టు పెండింగ్ లో ఉందని.. 41 నోటీసు అందజేయాలని అతడిని చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కి పిలిపించారు.

స్టేషన్ కి వచ్చిన యువకుడిని విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రసాద్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారని.. డబ్బులు ఇస్తేనే.. అతనిపై ఉన్న కేసులు మాఫీ చేస్తామని లేదంటే గంజాయి అక్రమ రవాణా కేసులు బనసాయిస్తానని బెదిరించారంటూ ఆరోపిస్తూ.. మజ్జి సెల్ఫీ వీడియో తీసుకొని  ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

యువకుడి మరణానికి కారణమైన కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రసాద్, విధుల  పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ దుర్గా ప్రసాద్ లపై జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు.  అవినీతది ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై శాఖాపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి.. వారిని విదుల నుంచి తొలగించడానికి సైతం వెనకాడమంటూ ఎస్పీ హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios