Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ కి చిరంజీవి రాజీనామా..?

ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. 

shocking news.. chiranjeevi may leaves congress party
Author
Hyderabad, First Published Oct 16, 2018, 11:11 AM IST

సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానమే వినపడుతోంది. సినీనటుడు ఒక వెలుగు వెలిగిన చిరంజీవి.. ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత దానికి కాంగ్రెస్ లో విలీనం చేసి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు.

రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడం, కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా మారారు. 150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి... ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.

అంతేకాకుండా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండి.. వచ్చే ఎన్నికల్లో జనసేన పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత తమ్ముడి పార్టీలోకి అడుగుపెట్టాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios