Asianet News TeluguAsianet News Telugu

కోడలిని కొట్టి చంపి తీర్థయాత్రలకు.. పద్మ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు...

తిరుపతిలో కలకలం రేపిన టేకీ వేణుగోపాల్ భార్య హత్య కేసులో అత్తామామలూ సూత్రధారులే. ఆమెను చంపడంతో కొడుకుకు సహకరించడమే కాకుండా.. చంపిన తరువాత చెరువులో పడేసీ తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. 

Shocking Facts Revealed in Techie Venugopal Wife Padma Murder Case In Tirupati
Author
Hyderabad, First Published Jun 1, 2022, 7:17 AM IST

తిరుపతి : Tirupatiలో కలకలం రేపిన పద్మ Murder caseలో కొత్త షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్యను హత్య చేయడంలో కొడుకుకు సహకరించిన.. తల్లిదండ్రులు.. ఆమెను చంపి చెరువులో పడేశాక.. Pilgrimageలకు వెళ్లారు. భర్త కూడా ఏమీ తెలియని వాడిలా హైదరాబాద్ కు వచ్చి కాపురం పెట్టాడు. ఐదు నెలలు గడిచాక కానీ.. అసలు విషయం వెలుగులోకి రాలేదు. 

ఆమె పాలిట భర్తే కాలయముడయ్యాడు. అత్తామామలూ అతడిని సహకరించారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యను వేధించడం మొదలు పెట్టిన ఆ ప్రబుద్ధుడు.. అదనపు కట్నం తీసుకురావాలని.. లేదంటే విడాకులు ఇవ్వాలంటూ వేధించిి పుట్టింటికి పంపేశాడు. ఆమె ససేమిరా అనడంతో.. సరే కాపురానికి  రమ్మంటూ.. నమ్మించి తీసుకొచ్చాడు.  గుమ్మంలోకి అడుగుపెట్టగానే తల్లిదండ్రులతో కలిసి ఆమెను కొట్టి, చంపి, మూటగట్టి చెరువులో పడేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. తిరుపతి తూర్పు డిఎస్పి మురళీకృష్ణ మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు.

తిరుపతి కొర్లగుంటకు చెందిన టీటీడీ ఉద్యోగి తిరుమల స్వామి పెద్ద కుమార్తె పద్మకు (33) స్థానిక సత్యనారాయణపురానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి కె వేణుగోపాల్ తో 2019 ఏప్రిల్లో పెళ్లి జరిగింది. నాలుగు నెలపాటు చెన్నైలో కాపురమున్న వారు తరచూ గొడవలు పడేవారు. తర్వాత తిరుపతికి కాపురం మార్చారు. అక్కడ భర్తతోపాటు ఆర్టీసీ కండక్టర్ అయిన మామ పాండురంగ చారి, అత్త రాణి అదనపు కట్నం కోసం వేధించి పుట్టింటికి పంపేశారు. విడాకులు ఇవ్వాలంటూ వేణుగోపాల్ నోటీసులు పంపాడు. భర్తకు దూరం కావడం ఇష్టం లేని పద్మ కోర్టు వాయిదాలకు వెళ్ళలేదు, తన కాపురం చక్కదిద్దాలని 2021లో మహిళా కమిషన్ను ఆశ్రయించింది.

ఎలాగైనా పద్మను అడ్డు తొలగించుకోవాలని వేణుగోపాల్ కుటుంబం పథకం పన్నింది. జనవరి 5న ఆమె పుట్టింటికి వచ్చి వేణుగోపాల్ కాపురానికి రమ్మని పిలవడంతో.. నమ్మిన ఆమె అతనితో బయలుదేరింది. ఇంటికి రాగానే  పద్మతో భర్త,  అత్తమామలు గొడవ పెట్టుకున్నారు. వేణుగోపాల్ ఆమె తలపై బలంగా కొట్టి చంపేశాడు. దుప్పట్లో మృతదేహాన్ని మూటకట్టారు.  బీదర్ కు చెందిన సంతోష్ అనే స్నేహితుడు, తల్లిదండ్రులతో కలిసి కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి వెంకటాపురం చెరువులో పడేసారు. అక్కడినుంచి అతడి తల్లిదండ్రులు తీర్థయాత్రలకు బయలుదేరగా, అతను హైదరాబాద్కు వెళ్లిపోయాడు. 

భార్యతో కలిసి హైదరాబాదులో జీవిస్తున్నట్లు బంధువులు, పద్మ కుటుంబ సభ్యులను నమ్మించాడు. అయితే అప్పటి నుంచి ఆమె తో ఫోన్లో మాట్లాడించ్చకపోవడం.. తిరుపతి కోర్టు విచారణకు హాజరు కాకవడంతో పద్మ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. వెంకటాపురం చెరువులో పడేసిన మూటను చూపించాడు.  మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు వేణుగోపాల్ తో పాటు అతడి తల్లిదండ్రులకు అరెస్టు చేశారు. మరో నిందితుడు సంతోష్ కోసం గాలిస్తున్నారు. తనను వేధించిన కారణంగానే పద్మను హతమార్చినట్టు నిందితుడు మీడియాతో పేర్కొనడం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios