జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడగా... తాజాగా మరో  నేత పార్టీని వీడటానికి రెడీ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున జగ్గయ్యపేట నియోజకవరర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ధరణికోట వెంకటరమణ గురువారం పార్టీకి రాజీనామా చేశారు.

జనసేకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. జనసేనలో చేరిన వెంటనే అనూహ్యంగా టికెట్‌ సాధించి బరిలో నిలిచిన ధ రణికోట ఆ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు, బహుజన్‌ సమాజ్‌ పార్టీ మద్దతు ఉన్నప్పటికీ ఒంటరిగానే పోరాడి 1311 ఓట్లు సాధించారు. బీజేపీ తరపున పోటీ చేసిన ఏపీ శ్రీకాంత్‌కు 577 ఓట్లు లభించాయి. 

ప్రత్యక్ష ఎన్నికల బరిలో కొత్తగా పోటీ చేసినా ఆయన 1311 ఓట్లను సాధించారు. ఎన్నికల తర్వాత కూడా జనసేనలో కొనసాగినా చురుగ్గా లేరు. ఇటీవల జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సజనా చౌదరి, బాపూజీ సంకల్పయాత్రకు విచ్చేసిన సందర్భంగా బీజేపీ నేతలు ఆయనతో బేటీ ఏర్పాటు చేశారు.
 
   సూత్ర ప్రాయంగా పార్టీలో చేరికపై నిర్ణయానికి వచ్చిన రమణ గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు బీజేపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీకాంత్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి నోముల రఘు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన్నె శ్రీనివాసరావు, కీసర రాంబాబు తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా ధరణికోట జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరినట్టు ప్రకటించారు. జాతీయ భావాలున్న పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, నిర్మాణాత్మకంగా లేని పార్టీలో ఎంతో ఉన్నత సిద్ధాంతాలు ఉన్నా ప్రజలకు న్యాయం చేయలేననే భావనతో బీజేపీలో చేరానని చెప్పారు.