గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలకు (డీడీఆర్సీ) సమావేశాలకు నారా లోకేష్ ను పిలువకూడదని సమావేశంలో తీర్మానం చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ను డీడీఆర్సీ సమావేశాలకు పిలువకూడదని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీర్మానం ప్రతిపాదించారు. ఆ తీర్మానానికి మంత్రులు, వైసిపి ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. 

నారా లోకేష్ మంగళగిరి నుంచి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.