Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుపై శైవక్షేత్ర పీఠాధిపతి షాకింగ్ కామెంట్స్

తెలుగు దేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వ్యాఖ్యానించారు. ఈ పార్టీకి వ్యతిరేకంగానే ప్రజల తీర్పు ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై సోమయాజులు కమిటీ ఇచ్చిన నివేధికపై శివస్వామి స్పందించారు.
 
shiva swamy shocking comments on ap government
Author
Amaravathi, First Published Sep 20, 2018, 8:58 PM IST

తెలుగు దేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వ్యాఖ్యానించారు. ఈ పార్టీకి వ్యతిరేకంగానే ప్రజల తీర్పు ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై సోమయాజులు కమిటీ ఇచ్చిన నివేధికపై శివస్వామి స్పందించారు.

ఈ నివేధిక తయారుచేసిన జస్టిస్ సోమయాజులు కమిటీకి భారతరత్నతో పాటు ఆస్కార్ అవార్డులిచ్చినా తక్కువేనని ఎద్దేవా చేశారు. పుష్కరాలలో తొక్కిసలాటకు భక్తుల మూడనమ్మకమే కారణమని ఆయన రిపోర్టులో పేర్కొనడాన్ని శివస్వామి తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు చేపడుతన్న అధర్మ పాలన వల్లే అంతటి ఘోరం జరిగిందని విమర్శించారు. ఆ మృతుల కుటుంబాల ఉసురు టిడిపి ప్రభుత్వానికి తాకుతుందని అన్నారు.

 తనపై కావాలనే ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెడుతోందని శివస్వామి ఆరోపించారు.టిటిడి నగల విషయంలో ప్రశ్నించినందుకే ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శైవక్షేత్ర పీఠ లెక్కలు, లావాదేవీలపై ఆరాతీస్తున్నారని ఆరోపించారు. తనపై ఇప్పటికే మూడు అక్రమ కేసులు పెట్టారని శివస్వామి ఆవేధన వ్యక్తం చేశారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios