ఈ క్రమంలోనే వరప్రసాద్‌ను పోలీసులు చిత్రహింసలు పెట్టారనే విమర్శలు వచ్చాయి. తనను బెల్ట్‌తో కొట్టారని బాధితుడు వాపోయాడు. తర్వాత శిరోముండనం చేశారని వరప్రసాద్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. 


ఆంధ్రప్రదేశ్ లో శిరోముండనం ఘటన ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా.. ఆ ఘటన అసలైన బాధితుడు వరప్రసాద్ ఇప్పుడు కనిపించకుండాపోయాడు. ఆయన కనిపించడం లేదంటూ.. వరప్రసాద్ భార్య సీతానగరం కౌసల్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

గతేడాది సీతానగరం పోలీస్‌స్టేషన్ పరిధిలో మునికూడలి అనే గ్రామంలో ఇసుకలారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్థానిక యువకులు, లారీ నిర్వాహకుల మధ్య గొడవ జరిగింది. దీంతో లారీ నిర్వహకులు పోలీసులను ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా వరప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే ఈ కేసులో వరప్రసాద్ ఏ2గా ఉన్నాడు. 

ఈ క్రమంలోనే వరప్రసాద్‌ను పోలీసులు చిత్రహింసలు పెట్టారనే విమర్శలు వచ్చాయి. తనను బెల్ట్‌తో కొట్టారని బాధితుడు వాపోయాడు. తర్వాత శిరోముండనం చేశారని వరప్రసాద్‌ కన్నీటిపర్యంతమయ్యాడు. వరప్రసాద్‌ శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగట్లేదని, నక్సలైట్లలో చేరడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే.