నెల్లూరులో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

Sexual Harassment on 7 Years Child in nellore
Highlights

కామాంధుడిని పట్టుకుని దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు

అభం శుభం తెలియని ఓ చిన్నారిని అత్యాచారం చేయాలని ప్రయత్నించిన ఓ కామాంధుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు. ఈ ఘటన నెల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో నిందితుడు పాపపై లైంగికదాడికి ప్రయత్నించాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు నగరంలో ఓ జంట అపార్టుమెంట్ వాచ్ మెన్ పనిచేస్తూ తమ ఏడేళ్ల కూతురితో కలిసి నివాసముంటున్నారు. ఇవాళ ఈ తల్లిదండ్రులు తమ పనుల్లో బిజీగా ఉండటంతో పాప అపార్ట్ మెంట్ బయట ఒంటరిగా ఆడుకుంటోంది. దీంతో నగరంలో చిత్తుకాగితాలు ఏరుకుని జీవించే సత్తి అనే వ్యక్తి ఆ పాపను ఎత్తుకుని సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లసాగాడు. గుర్తు తెలియని వ్యక్తి అలా తీసుకెలుతుండటంతో బయపడిపోయిన పాప ఏడవటం మొదలుపెట్టింది.

దీన్ని గమనించిన పాప కుటుంబ సభ్యులు, స్థానికులు సతీష్ ను పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించి...పాపను ఎక్కడికి తీసుకెళుతున్నావని ప్రశ్నించారు. దీనికి పొంతనలేమి సమాధానం చెప్పడంతో అతడికి  దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించి, నిందితుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

loader