బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనంగా మారి ఒడిశా ఉత్తర ప్రాంతం వద్ద కేంద్రీకృతమైంది. కాగా.. రానున్న 24గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అలాగే, వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కోస్తాంధ్రలో బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల చెదురుమదురు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. గురు, శుక్రవారాల్లోనూ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, విశాఖ నుంచి ప్రకాశం జిల్లా వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.