Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో సీరో సర్వే షాకింగ్ సర్వే: 19 శాతం మందికి కరోనా సోకినట్టుగా తెలియదు

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో 20. 3 శాతం మంది హైరిస్క్ లో ఉన్నట్టుగా నిర్ధారణ  సీరో సర్వేలో తేలింది.
 

Sero survey reveals 19 percent people not know they got corona
Author
Amaravathi, First Published Sep 10, 2020, 6:08 PM IST

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వచ్చి తగ్గిన వారిలో 20. 3 శాతం మంది హైరిస్క్ లో ఉన్నట్టుగా నిర్ధారణ  సీరో సర్వేలో తేలింది.

చాలా మందికి కరోనా సోకిన విషయం కూడ తెలియదని ఈ సర్వేలో తేలింది. గ్రామీణ  ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కరోనా సోకి తగ్గిందని ఈ సర్వే తేల్చింది. పురుషుల్లో 19.5 శాతం, 19.9 మహిళలకు కరోనా సోకి తగ్గిందని తేలింది. పట్టణాల్లో 22.5 శాతం మందికి కరోనా సోకి తగ్గిందని ఈ సర్వే తేల్చింది.

కంటైన్మెంట్ జోన్లలో 20.5 శాతం మందికి కరోనా వచ్చి తగ్గిందని ఈ సర్వే రిపోర్టులు వెల్లడించాయి.నాన్ కంటైన్మెంట్ జోన్లలో 19.3 శాతం మందికి కరోనా సోకిందని ఈ సర్వే రిపోర్టులు తెలిపాయి. 

రాష్ట్రంలో సీరో సర్వే ఈ ఏడాది ఆగష్టు మాసంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారంగా 90 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని  ఈ సర్వే తేల్చింది.అనంతపురం జిల్లాలో 99.5 మందికి కరోనా సోకినా ఆ వ్యాధి లక్షణాలు బయటపడలేదని ఆ సర్వే తేల్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios