Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరు రాజకీయాలకు ‘భూకంపం’ హెచ్చరిక

  • నెల్లూరు జిల్లా రాజకీయాలను భూకంపం కుదిపేయబోతున్నది  
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ రోజు సూచన ప్రాయంగా దీనిని వెల్లడించారు.
serious political trouble likely to hit nellore soon

నెల్లూరు రాజకీయాలలో తొందర్లో ఏదో జరగబోతున్నది. ఇది రాష్ట్రమంతా ప్రకంపనలు సృష్టించబోతున్నది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలు వదిలారు. ఆయన ఈ రోజు విజయవాడలో పార్టీ వర్క్ షాపులో  మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నది ‘వాళ్లే’... అన్నారు. అంటే,నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించింది ‘వాళ్లే ’నని పోలీసులు సమాచారం ఇచ్చినట్లున్నారు. దానిని ముఖ్యమంత్రి నమ్మి తీరతారు. తర్వాత పోలీసులకు ఏంచేయాలో కూడా మేసేజ్ వెళ్లి ఉంటుంది.

 

serious political trouble likely to hit nellore soon

వాళ్లంటే ఎవరిక్కడ... ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు. ఒకరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి(పోటో), రెండో వ్యక్తి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఒక రెన్నెళ్లుగా నెల్లూరు జిల్లా బెట్టింగ్ ఆరోపణ లతో కుతకుత లాడుతూ ఉంది.చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ లోపు పోలీసులు, ఇద్దరు ఎమ్మెల్యేలకు లింకుందని,బెట్టింగ్ కింగ్ పిన్  నుంచి వీళ్ల అకౌంట్లలోకి డబ్బు ట్రాన్స్ ఫర్ అయిందని లీకులిచ్చారు. తర్వాత నోటీసులొస్తున్నాయని లీకించారు. ఆ పైన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి, అనిల్ కు నోటీసులొచ్చాయి. ఈ మధ్యలో ఎస్పి అబ్బే మీకేమీ సంబంధం లేదన్నారని వారు విలేకరులతో చెప్పారు. కేవలం సాక్షులుగానే పిలస్తున్నామని వాళ్లకి హామీ ఇచ్చారు. ఈ లోపు రెండు  సార్లు ఇంటరాగేషన్ అయిపోయింది. ఏదో జరగబోతున్నదని శ్రీధర్ రెడ్డి, అనిల్ అనుమానిస్తున్నారు. కేసు పెడతారా, అరెస్టు చేస్తారా? అని సతమతమవుతున్నారు. బెట్టింగ్ వివాదంలో కనిపించిన ఇద్దరు వైసిపి ఎమ్మేల్యేలను విచారించి, ‘అబ్బే, మీకేం సంబంధంలేదు, సారీ, పొరపాటయింది. ఇక వెళ్లిరండి,’ పోలీసులు గేటుదాకా వచ్చి వారిని హీరోల్లాగా  సాగనంపుతారా? అబ్చే రాజకీయాలా మజాకా... నయాన, కాకుంటే భయాన, అదీ కాకుంటే బేరాన  ఎమ్మెల్యేలను లొంగదీసుకునే రాజకీయయుగంలోఅప్పనంగా దొరికిన ఇద్దరు ఎగస్పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు వదిలేస్తాడా? అసంభవం.

వాళ్ల మీద మీద బురదేసి, నల్ల రంగ చల్లి, బట్టలు చించి, బజారున పడేసే కార్యక్రమం మొదలువుతూ ఉందని, ఈ రోజు విజయవాడలో టిడిపి కార్యకర్తల సమావేశంలో ‘ బెట్టింగ్ నిర్వహించేది వాళ్లే,’ అని  నాయుడు గారు అనడం దీనికి సాక్ష్యం.  అలా అన్నాడంటే, కార్యాచరణ రూపొందిందనే అర్థం.

బెట్టింగ్ లో  వైసిపి ఎమ్మెల్యేలున్నారా లేదా అనేది అంత సులభంగా తేల్చరు. అదే రాజకీయం. ఈ లోపు వీరిని అరెస్టుచేసినా, కేసులు పెట్టినా, జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఆ బురద  కడుక్కునేందుకు శ్రీధర్ రెడ్డి చాలా కష్టపడాల. నిజానికి శ్రీధర్ రూరల్ నియోజకవర్గంలో గత మూడేళ్లలో మంచి  పేరుతెచ్చుకున్నాడు. ఎపుడూ జనం మధ్యే ఉన్నాడు. తన డబ్బులేకాదు, ఆ ఏరియాలో ఉండే వ్యాపారస్థుల, పారిశ్రామిక యజమానుల తో ఖర్చ పెట్టించి రోడ్లేయించారు, బోర్లు వేయించాడు, స్నేహితులనుంచి కూడా డబ్బు వసూలు చేసి చిన్నా చితక పనులు చేశాడు. కారణం- టిడిపి మాజీ ఎమ్మెల్యేలు లెటర్ రాస్తే నియోజకవర్గం అభివృద్ధి నిధులు రెండుకోట్లు గంటలో విడుదలవుతాయి. పోరాడినా ప్రతిపక్ష సభ్యులకు నిధులు రాలవు.  ఈ విషయం మొదట బయటపెట్టిందెవరోకాదు, భూమ నాగిరెడ్డియే. అందుకే చేతులు జోడించి, అవసరమయినచోట మందలించి, ధర్నాకు బైఠాయించి, ఆయన నియోజకవర్గం  పనులు చేయించాడని పేరుంది. ఇలాంటి వ్యక్తి మీద బురద  పడుతూ ఉంది. తప్పో వొప్పో తెలియదు. బురదయితే పడుతుంది. తొందర్లో అరెస్టు కావచ్చు, లేదా కేసుల్లో ఇరుక్కోవచ్చు.

దీని పర్యవసానం, ఎలా ఉంటుంది... శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలోగెల్చి బురద కడిగేసుకుంటాడా? ఎమ్మెల్యే గా ఉంటూ కోర్టులో న్యాయపోరాటం చేస్తాడా, లేక నిర్ధోషినని నిరూపించుకునేందు మరొక మార్గమేదయిన యోచిస్తాడా... 

 

మరిన్ని వార్తలు...

 

 

Follow Us:
Download App:
  • android
  • ios